ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్‌ల మీదుగా అమెరికా, యూరప్ వంటి పశ్చిమ దేశాలకు వెళ్లే భారతీయులకు ఇకపై ‘ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా’ (ATV) అవసరం లేదని జర్మనీ అధికారికంగా ప్రకటించింది. ఈ వెసులుబాటు కేవలం ఎయిర్‌పోర్ట్ లోపల (ఎయిర్‌సైడ్ ఏరియా) మాత్రమే ఉండే ప్రయాణికులకు వర్తిస్తుంది మీ ప్రయాణం మొత్తం ఒకే టికెట్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ మీరు వేర్వేరుగా టికెట్లు బుక్ చేసుకుంటే మాత్రం ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం సాధారణ వీసా తీసుకోవాల్సి ఉంటుంది.