ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (AP SIR)పై రాజకీయ పార్టీల్లో అప్పుడే అలజడి మొదలైంది రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 28 మంది ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పరిశీలకులు ఎన్నికల నమోదు అధికారులుగా ఉన్న ఈఆర్వోల పనితీరును పరిశీలిస్తూ, లోపాల్ని సరిదిద్దేందుకు తగిన సూచనలు, సలహాలు అందించబోతున్నారు.