విజయవాడలో మిస్టరీగా మారిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో రెండో రోజు కృష్ణలంక పోలీసు స్టేషన్లో ఏసీపీ దైవ ప్రసాద్ బృందం విచారణ చేపట్టింది. కృష్ణలంక స్వర్గపురి శ్మశానవాటికలో సిబ్బంది నుంచి మే నెలకు సంబంధించి ఎన్ని మృతదేహాలను దహనం చేశారో అడిగి తెలుసుకున్నారు. మే నెల 24, 25 తేదీల్లో దహనం చేసిన అనాథ మృతదేహాల వివరాలను పోలీసులు సేకరించారు. స్వర్గపురిలో రికార్డ్స్ పరిశీలించారు. మే 24, 25 తేదీల్లో నాలుగు అనాథ శవాలను దహనం సిబ్బంది చెబుతున్నారు.