IIT Bombay Campusలోకి ఓ చిరుత ప్రవేశించింది. స్టాఫ్ హాస్టల్ ఏరియాలో ఓ కుక్కను చంపేసింది. పోవాయ్‌లో ఉన్న వర్సిటీ సీసీ కెమెరాలకు ఆ ఘటన చిక్కింది. ఈ ఘటన 19వ తేదీ తెల్లవారుజామున రెండు గంటలకు జరిగింది. క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లోని రెసిడెన్షియల్ ఏరియాలో చిరుత సంచరిస్తున్నట్లు ఇప్పటికే ఫిర్యాదు ఉన్నది. హాస్టల్ మెట్ల వద్ద ఉన్న ఓ కుక్కను చిరుత తన నోటితో పట్టి చంపేసింది.