నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు భువనేశ్వరి. మీరు ఒక మంచి భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. మా జీవితాలకు వెలుగుగా నిలిచారు. మీ హుందాతనం, దయ, సమాజంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించాలనే మీ నిబద్ధత లెక్కలేనంత మందికి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి” అని ప్రశంసించారు.