రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ తన ప్రతిష్టాత్మక ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.37,700 కోట్లు) సమీకరించడం లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూ రూపొందిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువను సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.ఈ భారీ లిస్టింగ్ విజయవంతమైతే, ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది.