హన్మకొండ జిల్లాలోని హనుమాన్ నగర్‌లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ కుటుంబానికి టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. ఇటీవల ఈ బాలుడి కోరిక మేరకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి పరామర్శించిన సంగతి తెలిసిందే. బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయంగా రూ. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును బాలుడి తల్లిదండ్రులకు స్వయంగా అందజేశారు.