నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు లైన్ క్లియర్ అయ్యింది. పరీక్షను నిలిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో జూన్ 21న యథావిధిగా పరీక్ష జరగనుంది. నీట్ రీ ఎగ్జామ్ నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు నిరాకరిస్తూ.. పిటిషన్ ను కొట్టివేసింది.