నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పన, తదితరులు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పర్యటించి అర్బన్ పార్క్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.