తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో ఒక విద్యార్థిని బుధవారం నాడు హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని సంగారెడ్డి జిల్లా మానూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన అస్మితా బేగంగా పోలీసులు గుర్తించారు. హాస్టల్కు వెళ్తున్నానని చెప్పిన ఆమె.. గర్ల్స్ హాస్టల్-1 బ్లాక్ మొదటి అంతస్తు పైనుంచి అకస్మాత్తుగా కిందకు దూకేసింది భవనంపై నుంచి కిందపడటంతో అస్మితా బేగం తలకు, నడుముకు, కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది.