హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. మస్రుంద్-హమల్ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతులలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.