ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన నుగురే పాండురంగ్ (48) అనే రైతు జొన్న పంటను కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా, అధికారులు ఇప్పటివరకు ఆ జొన్న లోడ్‌ను మిల్లులకు లేదా గోదాములకు తరలించలేదు. తన పంట ఎక్కడ పాడైపోతుందోనని, చేతికి డబ్బులు అందడం లేదని పాండురంగ్ తీవ్ర మానసిక ఆందోళనకు గురై పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.