గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం తాము కాదన్నారు. ఏపీ మెగా డీఎస్సీ (DSC) నిర్వహణ, టీచర్ పోస్టుల నియామకాలపై ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలున్నా, వాటికి సమాధానం చెప్పేందుకు తానే స్వయంగా సిద్ధంగా ఉన్నానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా ఏపీలో డీఎస్సీ నియామకాలను ఆపలేరని నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా ‘సాక్షి క్యాలెండర్’ కాకుండా, తాము నిరుద్యోగుల కోసం నిజమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నామని ఎద్దేవా చేశారు.