loader

విజయవాడ లో బుధవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. ప్రముఖ రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ వార్డులో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను హుటాహుటిన వేరే సురక్షిత వార్డుల్లోకి తరలించారు. ఆస్పత్రి ప్రాంగణంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON