మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 సగటుతో 726 పరుగులు సాధించింది. తాజాగా హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచింది. స్మృతి మంధాన 524 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.