పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్ తో ఫోన్ ద్వారా ప్రమాద వివరాలు, సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.