రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వర్షాలు, వరద ముప్పు, ప్రకృతి విపత్తుల నిర్వహణపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సచివాలయంలో అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షం పడే సమయంలో ఫీల్డ్ లో ఉండని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వర్షం సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు రోడ్ల పైన ఉండాల్సిందేనని.. అవసరం అయితే తాను కూడా రోడ్డు మీదకు వస్తానని వ్యాఖ్యానించారు.