“అది నకిలీ వీడియో, అది నా గొంతు కాదు..” అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తేల్చి చెప్పారు. ఏఐసిసి నుంచి, పిసిసి నుంచి నోటీసు అందుకున్న షబ్బీర్ అలీ 24 గంటల లోపే పిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించి, బలహీనపరిచేందుకు జరిగిన కుట్ర అని ఆయన ఆరోపించారు. తప్పుడు ఆడియో రికార్డులను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలూ నమ్మవద్దని షబ్బీర్ అలీ కోరారు.