ఉత్తరప్రదేశ్ లోని ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరం ప్రాంగణంలోని డొనేషన్ బాక్సుల (హుండీల) లో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల నగదు కొన్ని రోజులుగా క్రమబద్ధంగా మాయమవుతోందంటూ వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. SP అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, పవిత్రమైన రామాలయ విరాళాలలో అక్రమాలు జరగడం అత్యంత విచారకరమని మండిపడ్డారు. హుండీల నుంచి దాదాపు రూ. 7 కోట్ల విరాళాలు మాయమయ్యాయని నేతలు ఆరోపణలు చేస్తూ,దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.