కేంద్రం సుపరిపాలన చేస్తే దానిని అందిపుచ్చుకోకుండా వైసీపీ నేతలు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుర్మార్గపు పాలనపై ఆరోజు విడివిడిగా మూడు పార్టీలు పోరాడితే ఎక్కడికక్కడ కేసులు పెట్టారని గుర్తు చేశారు. అరాచక చీకటి పాలనను చీల్చుకొని ప్రజలపాలన తెచుకున్నామని అన్నారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న తనను ఒక్క నోటీసు ఇవ్వకుండా 53 రోజులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ను సైతం అడుగడుగునా హేళన చేశారని అన్నారు.