సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి కొద్ది దూరంలోనే ఏకంగా రూ. 100 కోట్లతో బోధి పెవిలియన్ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పూట సతీసమేతంగా వెళ్లి అక్కడి పనులను, కుటుంబ సభ్యులతో సోఫాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ గెస్ట్ హౌస్ కోసం మొదట వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరుతో కేవలం రూ. 7 కోట్లతో జీవో ఇచ్చి, ఇప్పుడు దాన్ని రూ. 100 కోట్లకు పెంచారని ఆరోపించారు.