“ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహారిస్తున్నారు..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వంటి సీఎంలను చూశానని, వారిని ఇళ్ల ముందే ఘెరావ్ చేశానని, ఉద్యమాలు చేస్తూ ఢిల్లీ వరకు వచ్చానని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి గత కొన్ని రోజులుగా.. తనపై వ్యక్తిగతంగా అనేక రకాల అబద్ధాలతో విమర్శిస్తున్నారని తెలిపారు. పొలిమేరలు దాటనివ్వను, రాష్ట్రంలో తిరగనివ్వను అని మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.