జూన్ 10, 2026న ప్రధాని నరేంద్ర మోదీ 4,399 రోజుల పాలనను పూర్తి చేసుకునే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో ఎడిటోరియల్ వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో “నేషన్ ఫస్ట్” నినాదంతో మోదీ పాలనా విధానాన్ని ప్రశంసించారు. ప్రధాని మోదీ సరైన సమయంలో సరైన నాయకుడనీ, గత 12 ఏళ్లలో ఆ నమ్మకం మరింత బలపడిందని చంద్రబాబు తెలిపారు. ఈ వ్యాసం భారత సాంస్కృతిక గర్వం, జాతీయ ఆత్మవిశ్వాసాన్ని మోదీ నాయకత్వంలో తిరిగి కనుగొన్నట్లు వివరించింది.