అభివృద్ధి పనులకు అడ్డంపడుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంగతి బరాబర్ చూస్తా అని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చదువు చెప్పిస్తామంటే అడ్డుపడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు అడ్డం పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రెంట్ , ఢిల్లీలో యుమునా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేశారని.. తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన చేయోద్దా..? అని సీఎం ప్రశ్నించారు.