హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నూతన డైరెక్టర్ గా సీనియర్ యురాలజీ వైద్యులు డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నిమ్స్ యురాలజీ విభాగం ప్రొఫెసర్ గా, HODగా సేవలందిస్తున్న డాక్టర్ రాహుల్ దేవ్జ్ ను మూడేళ్ల కాలపరిమితికి డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 179 ద్వారా ఆదేశాలు ఇచ్చింది.