ఢిల్లీలో శనివారం జరిగింది కేవలం ట్రయలర్ అని, ఇకపై మరింత ఉధృత రీతిలో తమ ఆందోళన ఉంటుందని కాక్రోచ్ జనతాపార్టీ నేత అబిజిత్ దీప్కే ప్రకటించారు. జంతర్‌మంతర్‌లో నిరసన ప్రదర్శన తరువాత ఆయన వాట్సాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరికలు వెలువరించారు. ఇది ఆరంభమే , ఇకపై ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి నేరుగా వచ్చి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తరువాత ఆయన మహారాష్ట్రలోని తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు బయలుదేరి వెళ్లారు.