రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్ 18లో సుమారు రూ.1,500 కోట్ల భూమి కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడిని పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా బ్రహ్మనాయుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు బ్రహ్మనాయుడిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు సమాచారం.