నీట్ పేపర్ లీకేజీ, ఎల్ పిజి , పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, సిబిఎస్ఇ వైఫల్యం, రూపాయి పతనంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బషీర్ బాగ్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడంతో వారు ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు.