చిత్తూరు జిల్లాలో బసిరెడ్డిపల్లి సమీపంలో భారీగా మద్యం లోడుతో వెళ్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని మద్యం సీసాలు రోడ్డుపై, పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్ల పరిస్థితిని పట్టించుకోకుండా.. రోడ్డుపై పడి ఉన్న లిక్కర్ బాటిళ్లను ఏరుకోవడంలో నిమగ్నమయ్యారు. చేతికి దొరికినన్ని సీసాలను పట్టుకుని పరుగులు తీశారు. కొందరైతే ఏకంగా తమ లుంగీలు, టవళ్లనే సంచులుగా మార్చుకుని, అందులో మద్యం సీసాలను కుక్కుకుని మరీ ఇళ్లకు తరలించారు.