మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ భార్యకు అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. సీనియర్ డాక్టర్ అయిన సుచి యాష్కీకి తీవ్ర గాయాలు అయ్యాయనీ… రిబ్స్ విరిగాయని డాక్టర్లు తెలిపారు. చికిత్స తర్వాత ఆమె కోలుకుంటున్నట్లు వివరించారు. కూతురు గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి, బోస్టన్ నుంచి న్యూయార్క్ వస్తుండగా.. వర్షం కారణంగా కారు ప్రమాదం జరిగింది.
కారులో లగేజీ ఎక్కువగా ఉండటంతో.. మధు యాష్కీ వేరే కారులో ప్రయాణిస్తున్నారు.