పవన్ మాటలపై దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆమె ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ‘తెలంగాణ ఎవరి జాగీరు?’ అని ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ.. “అవును పవనన్న, ఈ తెలంగాణ గడ్డ నిన్న మా తండ్రుల జాగీరు, ఈరోజు మా జాగీరు, రేపు మా పిల్లల జాగీరు. ఇది ముమ్మాటికీ మా తెలంగాణ ప్రజల జాగీరే” అంటూ ఆమె సంచలన కౌంటర్ ఇచ్చారు.