కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని కచ్ జిల్లా పాకిస్తాన్‌తో అత్యంత సున్నితంగా ఉండే హరామి నాలా, సర్ క్రీక్ ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. సరిహద్దులో మన భద్రతా బలగాల పటిష్టతను స్వయంగా పరిశీలించి, వ్యూహాత్మక మార్పులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనతో సరిహద్దు వెంబడి నిఘా మరింత కఠినతరం కానుంది. సరిహద్దు భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా అమిత్ షా కొత్తగా నిర్మించిన జి7 బోర్డర్ అవుట్ పోస్ట్‌ను ప్రారంభించారు.