దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో విదేశీయులతో సహా 21 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం. మరికొంత మంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో చిక్కుకుపోయిన పలువురిని అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి సురక్షితంగా రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.