తెలంగాణ ఏర్పాటుకు ఒక ప్రత్యేకత ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పెద్ద చరిత్ర ఉందని.. తరాలు మారినా, స్వరాలు మారిన, వాస్తవాలు మారవని తెలిపారు. 1952లో గైర్ముల్కీ ఉద్యమం జరిగింది.. అప్పుడు తుపాకీల మోతతో ఏడుగురిని బలికొన్న విలన్ కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. 1968 నుంచి 1971 వరకు తెలంగాణ ఉద్యమంలో 370 మంది విద్యార్థులను
బలిగొన్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలంగాణను మాకు ఇవ్వండని అడిగితే.. ఆనాడు ఉద్యమాన్ని అణిచివేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.