కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మార్గమధ్యలో టీమ్‌లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపారు. కోళ్ల లోడ్‌తో వస్తున్న వాహనం వెనుక నుంచి కారును ఢీ కొట్టింది. దీంతో కారు వెనకాల భాగంలో నిలబడిన పండు మాస్టర్ తో పాటు లిఖిత ప్రియ, హారిక అనే మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పండు మాస్టర్ రెండు కాళ్లకు బలంగా గాయాలు అయినట్లు చెప్తున్నారు.