తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చీలిక ముప్పు కనిపిస్తోంది. పార్టీ నుండి సస్పెండ్ అయిన నాయకుడు రిజు దత్తా ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. పార్టీ భవిష్యత్తుపై 50 మంది ఎమ్మెల్యేలు ఒక హోటల్‌లో రహస్య చర్చలు జరిపారని వీరు పశ్చిమ బెంగాల్ స్పీకర్‌ను కలిసి మూడు కీలక డిమాండ్లను ముందుకు తెస్తారని తెలిపారు. తామే “అసలైన తృణమూల్” అని ప్రకటించుకోవడం, పార్టీ గుర్తుపై తమకు హక్కు ఉందని వాదించడం, ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బందోపాధ్యాయ ఉండాలనడం ప్రధానమైనవి.