భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు.