హైదరాబాద్ లో సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. సమావేశం నిర్వహణకు పోలీసులు ఇప్పటికే నిరాకరించిన నేపథ్యంలో.. జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా ఆ పార్టీకి చుక్కెదురైంది. దీనిని పరిశీలించిన రిజిస్ట్రీ హౌస్ మోషన్ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత ఇందులో లేదంటూ పిటిషన్ ను తిరస్కరించింది.