భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగటు ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఆమె అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. తాను ఓడిపోగానే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధికారులు చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారని వినేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ దృశ్యం చూడగానే తాను మోసపోయిన ఫీల్ కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫెడరేషన్ లోని కొందరు వ్యక్తులు తన కెరీర్ త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నారని, భవిష్యత్తులో ఆటతోనే అందరికీ సమాధానం చెబుతానని పట్టుదలను వ్యక్తం చేశారు.