రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో మొత్తంగా కలిపి కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్దం చేశారు. ఒక జిల్లా ఒక థీమ్ తో 14 రోజుల యోగాంధ్ర నిర్వహిస్తారు. జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణకు జిల్లాకు రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.