ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం ఇవాళ స్పందించింది.
మెగా డీఎస్సీపై ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. మెరిట్ ఆధారంగానే డీఎస్సీలో నియామకాలు జరిగాయని టాటా ఆయన్ ఆధ్వర్యంలో, మల్టీ లెవెల్ డిజిటల్ సెక్యూరిటీతో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సీబీటీ విధానంలో మెగా డీఎస్సీ నిర్వహణతో, ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశం లేదని కోన శశిధర్ తెలిపారు.