మణిపూర్ లో పశ్చిమ బెంగాల్ ట్రక్ డ్రైవర్ను ఇంఫాల్-ఉజ్రుల్ రోడ్డులోని టి.ఎమ్. కాసోమ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మాటువేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు నిరసనగా వందలాది మంది ట్రక్ డ్రైవర్లు ఈరోజు జాతీయ రహదారి- 37 (ఇంఫాల్-జిరిబామ్ రోడ్డు) పై రవాణా సేవలను పూర్తిగా నిలిపివేసి భారీ నిరసనకు దిగారు. మరణించిన తోటి డ్రైవర్ కు మద్దతుగా దాదాపు 400 ట్రక్కులు కీథెల్మాన్బి వద్ద నిలిచిపోయాయి. ఇందులో ఎల్పీజీ బుల్లెట్ ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు, నిత్యావసర సరుకుల వాహనాలు ఉన్నాయి.