గుజరాత్‌లోని గిర్ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో 8 సింహం కూనలు మృతిచెందాయి. బేబీసియా ఇన్‌ఫెక్షన్ వల్ల ఆ కూనలు మృతిచెందినట్లు అటవీశాఖ మంత్రి అర్జున్ మోద్వాదియా తెలిపారు. అయితే ఆ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు అధికారులు సింహాలను 10 కిలోమీటర్ల పరిధిలో వేరు చేశారు. బేబీసియా వ్యాధి ఓ పరాన్నజీవి వల్ల సోకుతుంది. పేనుల వల్ల ఆ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాధి సోకడం వల్ల జంతువు బలహీనమవుతుంది. జంతువుల్లో దగ్గు, ముక్కు నుంచి నీరు కారుతుంది.