ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు ఎన్టీఆర్ లేకుంటే కేసీఆర్ గానీ, లేదా ఇతర నేతలు గానీ ఈ స్థాయికి వచ్చేవాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు అని, ఆయన నీడన బతికి ఈరోజు ఆయన గురించే తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తూ, ఆయన విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదా తక్కువ చేయడం వారి నకిలీ ఆలోచనలకు నిదర్శనమని రేవంత్ ఎద్దేవా చేశారు.