కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. సిద్దరామయ్య తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కార్యాలయంలో అందజేశారు. సిద్దరామయ్య మాట్లాడుతూ… ‘‘గవర్నర్ కార్యాలయం నా రాజీనామాను సమర్పించాను. లోక్‌భవన్‌లో గవర్నర్ అందుబాటులో లేరు. నేను ఆయన కార్యాలయంలో రాజీనామా లేఖను అందజేశాను’’ అని తెలిపారు. కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ జూన్ 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా సమాచారం.