కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అల్పాహార విందు సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సిద్ధరామయ్య కాళ్లకు నమస్కరించిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. మరోవైపు తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.