ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పలువురు జర్నలిస్టులతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సమావేశంలో కొందరు విలేకర్లు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వారిని వారించకపోగా, మౌనంగా మద్దతు పలికినట్లు వ్యవహరించడం సరికాదని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.