తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో సమీక్షా సమావేశంలో మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చోవడంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అలీ హజారీ మధ్య మొదట వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పి ఇద్దరూ పరస్పరం దూషించుకుంటూ తోపులాటకు దిగారు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. మంత్రులు, ఇతర నేతలు వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగింది.