ఆఫ్రికా దేశాల ను వణికిస్తున్న ఎబోలా కొత్త వేరియంట్‌కు తమ శాస్త్రవేత్తలు సరికొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో ఈ కీలక ప్రకటన చేశారు. తమ దేశ పరిశోధకులు తయారు చేసిన కొత్త టీకా ఈ అరుదైన బుండిబుగ్యో వేరియంట్ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆఫ్రికా దేశాలకు ఎబోలా నిర్ధారణ కిట్లు, అవసరమైన వైద్య సాయాన్ని కూడా అందిస్తామని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది.