సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో చౌటాకూర్ మండలంలోని 161 జాతీయ రహదారిపై ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది. అలాగే కోర్పోల్, ఉప్పరిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి కూడా వర్షానికి తడవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. లారీల కొరతతో పాటు మ్యాచింగ్ సమస్యలను సాకుగా చూపుతూ అధికారులు కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.